Saudi Arabia : పాలస్తీనాపై అంతర్జాతీయ కూటమి సమావేశం

రియాద్‌ :   పాలస్తీనా  ప్రత్యేక  హోదా కోసం ఒత్తిడి చేసేందుకు ‘అంతర్జాతీయ కూటమి’ మొదటి సమావేశాన్ని బుధవారం సౌదీ అరేబియా నిర్వహించింది. రియాద్‌లో జరగనున్న రెండు రోజుల సమావేశంలో దాదాపు 90 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయని  సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్‌ ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ తెలిపారు. పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి తరిమి కొట్టే లక్ష్యంతో ఓ మారణ హోమం జరుగుతోందని, దానిని సౌదీ అరేబియా తిరస్కరిస్తోందని అన్నారు. గాజాలో మానవతా పరిస్థితిని విపత్తుగా అభివర్ణించారు. ఉత్తర గాజా పూర్తి దిగ్బంధనాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

రియాద్‌ సమావేశం మానవతా సాయం, పాలస్తీనా శరణార్థుల కోసం పోరాడుతున ఐరాస సంస్థ, రెండు దేశాల  పరిష్కారాన్ని ముందుకు తీసుకువెళ్లేడానికి చర్యలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నట్లు దౌత్యవేత్తలు పేర్కొన్నారు. మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియ ప్రత్యేక ప్రతినిధి స్వెన్‌ కూప్‌మాన్‌ యూరోపియన్‌ యూనియన్‌కు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించినట్లు దౌత్యవేత్తలు తెలిపారు. ఇజ్రాయిల్‌ సైనిక మద్దతుదారు, పాలస్తీనా వ్యవహారాలకు సంబంధించిన స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రత్యేక ప్రతినిధి హేడీ అమ్ర్‌ను అమెరికా సమావేశానికి పంపింది.

ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ ప్రభుత్వం పాలస్తీనా ప్రత్యేక హోదాను  నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తోంది.

➡️