థాయిలాండ్‌లో ఘోరం

School bus catches fire in Bangkok, 25 on board feared dead
  • స్కూలు బస్సు మంటల్లో చిక్కుకొని 25 మంది మృతి

బ్యాంకాక్‌ : థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ శివారు ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఘోరం చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన ఒక స్కూలు బస్సు మంటల్లో చిక్కుకున్న ప్రమాదంలో 25 మంది సజీవదహనమయ్యారు. వీరిలో 22 మంది విద్యార్థులు కాగా మరో ముగ్గురు ఉపాధ్యాయులు. ఈ దారుణ ఘటనలో మరో 16 మంది గాయపడ్డారు. సెంట్రల్‌ ఉతారు థాని ప్రావిన్స్‌ నుంచి బస్సు తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని, ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారని థారుల్యాండ్‌ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 38 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి షినవత్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

➡️