ఖాట్మాండ్ : నేపాల్ ఘటనలో ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గత శుక్రవారం కొండచరియలు విరిగిపడి రెండు బస్సులు కొట్టుకుపోవడంతో 60 మందికి పైగా గల్లంతైన సంగతి తెలిసిందే. త్రిశూల్ నది ఒడ్డున వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలను గుర్తించినట్లు సహాయకులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు కాగా, మిగిలిన నలుగురు నేపాలీ జాలీయులని ప్రభుత్వ ప్రతినిధి ఖిమానంద భూసల్ పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించామని, బంధువులకు సమాచారం అందించామని అన్నారు.
ఖాట్మాండుకు పశ్చిమాన 120 కిలోమీటర్ల (75 మైళ్ల) దూరంలో ఉన్న సిమల్టాల్ సమీపంలో నేపాల్ రాజధానిని దేశంలోని దక్షిణ ప్రాంతాలకు కలిపే కీలక రహదారిపైనుండి రెండు బస్సులు పడిపోయాయి. బస్సులు పడపోయిన ప్రదేశానికి 50 కి.మీ దూరంలో ఆదివారం మొదటి మృతదేహాన్ని వెలికితీశారు.
వాతావరణ హెచ్చరికలతో రాత్రిపూట ప్రయాణించే ప్యాసింజర్ బస్సులపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.