- బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ : అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రధాన వినిమయ కరెన్సీగా డాలర్ పాత్రను మార్చాలన్న ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలనుద్దేశించి మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. డాలరు రహిత వాణిజ్యానికి యత్నిస్తే, బ్రిక్స్ దేశాల ఎగుమతులపై వంద శాతం సుంకాలు విధిస్తామని మరోసారి బెదిరించారు. కొత్త బ్రిక్స్ కరెన్సీని సృష్టించబోమని లేదా డాలరు స్థానంలో మరే ఇతర కరెన్సీని బలపరచబోమని ఆ దేశాలు హామీ ఇవ్వాల్సి వుంటుందని అన్నారు. లేనిపక్షంలో వారిపై వంద శాతం టారిఫ్‌లు విధిస్తామని, అమెరికా ఆర్థిక వ్యవస్థలో విక్రయాలకు ఇక గుడ్‌బై చెప్పాల్సి వస్తుందని హూంకరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.