- కీలక ఎగుమతులు నిలిపివేసిన చైనా
బీజింగ్ : టారీఫ్‌ల యుద్దంలో అమెరికాకు చైనా గట్టి షాక్ ఇచ్చింది. అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాలను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని చైనా నిలిపివేసింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ సోమవారం ఒక కథనం ప్రచురించింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాతో పాటు, అనేక పశ్చిమదేశాల్లో ఆయు ధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్ ఇండిస్టీ, సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలకు అనేక సమస్యలు ఎదురుకానున్నుట్లు ఆ కథనంలో పేర్కొంది. రెండవసారి అధ్యక్షునిగా ఎన్నికైన తరు వాత ట్రంప్ ప్రారంభించిన ఈ టారీఫ్‌ల యుద్ధంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా తీసుకున్న తాజా నిర్ణయం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎగుమతులకు సంబంధించి నూతన నిబంధనలను చైనా రూపొం దిస్తోంని, అప్పటి వరకు చైనా పోర్టుల నుండి వీటి ఎగుమతిని నిలిపివేసినట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతీ వస్తువు తయారీలో కీలకమైన అయస్కాంతాల రవాణా స్థంభించడంతో తయారీ రంగంపై పెను ప్రభావం పడుతుందని సమాచారం.
చైనా నుండి దిగుమతులే ఆధారం
అమెరికాలోని రక్షణరంగంతో పాటు పలు ఇతర పరిశ్రమలకు చైనా నుండి జరుగుతుతన్న దిగుమతులే కీలక ఆధారం. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలు పెట్టిన టారిప్‌ల యుద్ధంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజాలు, లోహాల్లో దాదాపు 90శాతం చైనానే తయారు చేస్తుంది. వీటిలో 17 మూలకాలను రక్షణ, ఎలక్ట్రిక్ వెహికల్, ఇంధన, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో వాడ తారు. దశాబ్దాలుగా చైనాపై ఆధారపడుతూ వచ్చిన కీలకమైన ఖనిజాలు, ఇతర సరఫరాలు నిలిచిపోవడం తో అమెరికన్ తయారీ రంగం అల్లకల్లోలమవుతుంది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం ఈ తరహా లోహాలు, అయస్కాంతాల ఎగుమతికి చైనా ప్రత్యేక లైసెన్స్ విధానాన్ని రూపొందించనుంది. అయితే, ఆ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి రావడానికి మరింత సమయం పట్టనుంది. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబొట్లు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, గాసోలిన్‌తో నడిచే కార్లు తయారీలో చైనా నుండి దిగుమతయ్యే లోహాలు అత్యంత కీలకమైనవి. అదే విధంగా జెట్ ఇంజన్లు, లేజర్లు, కార్ హెడ్‌లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్‌లు, కేపాసిటర్లు తయారీలో కూడా ఈ లోహాలు అవసరమవుతాయి.