వాషింగ్టన్ : అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభ సభ్యులుగా ఆరుగురు భారతీయ అమెరికన్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికాలో మైనారిటీలుగా వుండే భారతీయులు ప్రతినిధుల సభకు ఇంత పెద్ద సంఖ్యలో ఎన్నిక కావడం ఇదే తొలిసారి. 12 ఏళ్ల క్రితం ఇండో అమెరికన్ల నుంచి తానొక్కడినే ప్రతినిధుల సభకు ఎన్నికయ్యానని, ఇప్పుడు ఓ అరడజను మంది ఎన్నిక కావడం విశేషమే మరి అన్నారు డాక్టర్ అమి బెరా. బెరా వరుసగా ఏడవ సారి కాలిఫోర్నియా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ నుండి సభ్యుడిగా గెలుపొందారు. వీరిలో కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, ఖన్నా వీరు ముగ్గురు ఐదవ సారి సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో వాషింగ్టన్ రాష్ట్ర ఏడవ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్ ఏకైక ఇండియన్ అమెరికన్ మహిళ కావడం విశేషం.
