అనేక మందికి గాయాలు
టెల్ అవీవ్ : ఇజ్రాయిల్ వాణిజ్య కేంద్రమైన టెల్ అవీవ్‌లో గత రాత్రి ఇద్దరు ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రతీకార దాడిలో ఇద్దరు ముష్కరులను పోలీసులు హతమార్చారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. రైలులో మరియు రైల్వే స్టేషన్ ప్రాంతంలో దాడి జరిగింది. ముష్కరులు రైలు నుంచి బయటకు వచ్చి దాడికి పాల్పడుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. ముష్కరులు తుపాకులు, కత్తులతో దాడికి పాల్పడ్డారని ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ భూతలదాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్‌లోకి క్షిపణులు ప్రయోగించబడ్డాయి. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. క్షిపణులు టెల్ అవీవ్ మరియు జెరూసలేంలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయిల్ పేర్కొంది. క్షిపణి దాడిలో ఇంకా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే జనావాస ప్రాంతాల్లో క్షిపణులు దిగిన దృశ్యాలు బయటపడ్డాయి. పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఈ దాడితో తాత్కాలికంగా మూసివేసిన ఇజ్రాయిల్ గగనతలం ఈరోజు మళ్లీ తెరుచుకుంది.