అమెరికాలో మంచు తుపాను

Jan 9,2025 00:08 #America, #Snow storm
  • స్తంభించిన విద్యుత్‌ సరఫరా

మిస్సోరి: అమెరికాలో భారీ మంచు తుపానుతో వర్జీనియా, కాన్సాస్‌, న్యూజెర్సీ రాష్ట్రాలు గజగజ వణుకుతున్నాయి. మంచు పెద్దయెత్తున పేరుకుపోవడంతో రోడ్లపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. విమానాశ్రయాల్లో విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది. మధ్య, తూర్పు అమెరికా అంతటా హిమపాతం విపరీతంగా పెరిగి రికార్డులు బద్దలుగొడుతోంది. భారీ మంచు కారణంగా వాషింగ్టన్‌ డిసిలో పాఠశాలలు, ఫెడరల్‌ కార్యాలయాలను మూసివేశారు. దాదాపు రెండు లక్షల నివాస గృహాలు, వ్యాపార సంస్థలు విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలో చిక్కుకున్నాయి. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ అంత్యక్రియల షెడ్యూల్‌ను కూడా ప్రతికూల వాతావరణం ప్రభావితం చేసింది.

➡️