South Korea : మొదటిసారి కోర్టు మెట్లెక్కిన అభిశంసనకు గురైన అధ్యక్షుడు

సియోల్‌ :   అభిశంసనకు గురైన దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్‌ వారెంట్‌పై విచారణ కోసం శనివారం మొదటిసారి కోర్టుకు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్‌ 3న ఏకపక్షంగా జారీ చేసిన మార్షల్‌ లా డిక్రీపై దర్యాప్తు అధికారులు విచారిస్తున్నందున నిర్బంధాన్ని కొనసాగిస్తారా లేదా అనేది నేడు నిర్ణయిస్తారు. యూన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. యూన్‌ కస్టడీని పొడిగించేందుకు దర్యాప్తు అధికారులు శుక్రవారం కొత్త వారెంట్‌ను జారీ చేయాల్సిందిగా అభ్యర్థించారు. ప్రస్తుతం యూన్‌ కస్టడీలోనే ఉన్నారు.

మరోవైపు యూన్‌ మద్దతుదారులు శనివారం కోర్టు ఎదుట నిరసనకు దిగారు. యూన్‌ను కోర్టుకు తీసుకువస్తున్న వ్యాన్‌ను చుట్టుముట్టేందుకు యత్నించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

➡️