సియోల్ : దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూన్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనపై శుక్రవారం ఓటింగ్ జరిగింది. 300 మంది సభ్యులు కలిగిన పార్లమెంటులో సుమారు 192 మంది హాన్‌పై అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు.
ప్రజల ఆదేశానుసారం శుక్రవారం తమ పార్టీ ప్రధాని హాన్ డక్‌సూన్‌ను అభిశంసించిందని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ నేత లీ జే మ్యూంగ్ తెలిపారు. తాత్కాలిక అధికారం, తిరుగుబాటు అధికారంగా మారిందని అన్నారు.
డిసెంబర్ 3న మార్షల్‌లా విధించినందున దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ డిసెంబర్ 14న అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ప్రధాని హాన్ డక్ సూన్ దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. హాన్ అభిశంసన తర్వాత, దక్షిణ కొరియా చట్టం ప్రకారం.. ఆర్థిక మంత్రి చోరు సాంగ్-మోక్ తాత్కాలిక అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.