– శిథిలాల్లో చిక్కుకుపోయిన 600 మంది
– తైవాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
తైపే : తైవాన్‌లో భూకంపం సంభవించి మూడు రోజులు గడిచినా ఇప్పటికీ 600 మందికి పైగా ప్రజలు వివిధ ప్రారంతాల్లో చిక్కుండిపోయారు. వీరిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక ప్రజలతో కలిసి రక్షణ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. తరొకో పార్క్‌లో కుప్పకూలిన హోటల్ శిథిలాల్లో 450 మంది పైగా చిక్కుకుపోయారు. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడడం, ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడం వంటి కారణాలతో వీరు స్వస్థలాలకు వెళ్ళలేకపోయారు. ఈ భూకంపంలో 12 మంది మరణించగా దాదాపు 1000 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తరొకో పార్క్‌లోని హౌట్ల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు, మార్గమధ్యంలో విరిగిపడిన కొండచరియల శిథిలాలను తొలగించేందుకు హెలికాప్టర్లు, ఇతర భారీ యంత్ర సామాగ్రిని ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ భూకంపంలో చిక్కుకున్న ఇద్దరు భారతీయులు సురక్షితంగానే వున్నారని సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.
