వాషింగ్టన్ : అమెరికా తెరదీసిన వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. చైనాపై అమెరికా కక్షసాధింపు చర్యలకు పాల్పడడం కొనసాగిస్తూనే ఉంది. నిన్న మొన్నటివరకు చైనా దిగుమతులపై ఏ దేశానికి లేనంతగా 145 శాతం పన్నులు విధించింది. ఇప్పుడు మరోసారి ప్రతీకార చర్యల్లో భాగంగా తాజాగా చైనా దిగుమతులపై 245 శాతం మేర అమెరికా పన్నులు విధించింది. ఈ మేరకు వైట్ హౌస్ ఫ్యాక్ట్‌షీట్ విడుదల చేసింది.
కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే.. వివిధ దేశాలపై పన్నులు విధించిన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలు పన్నులు విషయంలో ట్రంప్‌ను సంప్రదించగా.. 90 రోజులపాటు పన్నులను విధించడం నిలుపదల చేశారు. అయితే అందులోనుంచి చైనాను మినహాయించిన సంగతి తెలిసిందే.
