తెలంగాణ : అమెరికాలో మరోసారి జరిగిన కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. నెల రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ వార్త మరవక ముందే మరో హైదరాబాద్ యువకుడు కాల్పుల్లో మరణించాడు. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నంబర్ 2 లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌలి కుమారుడు రవి తేజ 2022లో మార్చిలో అమెరికాకు వెళ్లాడు. అక్కడ అతను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన దుండగుల కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో హైదరాబాద్‌లోని అతని ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
