న్యూయార్క్ : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐరాస జనరల్ అసెంబ్లీ డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మానానిు జనరల్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టగా మొత్తం 193 సభ్యులకుగాను 158 మంది దీనికి మద్దతు తెలిపారు. తొమ్మిది మంది వ్యతిరేకించగా, 13 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.