- మెలోనియా బడ్జెట్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాపిత సమ్మె
రోమ్: ఇటలీలో కార్మిక వర్గం అపూర్వమైన సమ్మె చేసింది. పచ్చి మితవాది మెలోనియా ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా ఇటలీలోని కార్మిక సంఘాలన్నీ కలసి శుక్రవారం 8 గంటల సార్వత్రిక సమ్మె చేశాయి. వేలాది మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె వల్ల దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. స్కూల్స్, ఆస్పత్రులు, స్థానిక రవాణాకు తీవ్ర అంతరాయమేర్పడింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుండడం, తక్కువ వేతనాలు, ప్రజా సేవలను నిర్వీర్యం చేయడం వంటి చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. దేశంలో వేతనాలు తక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారని, దీని వల్ల హెల్త్ కేర్ సెక్టార్‌లో నర్సుల కొరత తీవ్రంగా ఉందని రోమ్‌కు చెందిన కార్యకర్త అన్సా సల్సా చెప్పారు. సిబ్బంది తక్కువగా ఉన్నారని ఒకరికి రోజుకు రెండు మూడు షిఫ్టులు వేస్తున్నారని అన్నారు.