ఇంటర్నెట్ : ప్రపంచంలోని అత్యంత వృద్ధుడు, బ్రిటన్ జాన్ టిన్నిస్‌వుడ్(112) నార్త్‌వెస్ట్ ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లోని ఒక కేర్ హోమ్‌లో మరణించినట్లు అతని కుటుంబం మంగళవారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ధృవీకరించింది. 1912 ఆగస్టు 26న లివర్‌పూల్‌లో జన్మించిన టిన్నిస్‌వుడ్ సోమవారం మరణించారని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ లో మరణించిన వెనిజులాకి చెందిన జువాన్ విసెంటె పెరెజ్(114) తరువాత ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా టిన్నిస్‌వుడ్ నిలిచాడు. అనేక సంవత్సరాలుగా అతనిని చూసుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తునట్లు కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది. టైటానిక్ మునిగిపోవడం, రెండు ప్రపంచ యుద్ధాలు వంటి స్మారక సంఘటనలు జరిగినప్పుడు ఆయన జీవితంలో ముఖ్య ఘటనలని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో మాట్లాడుతూ…. ”మీరు ఎక్కువ కాలం జీవిస్తారు లేదా తక్కువ కాలం జీవిస్తారు, దాని గురించి మీరు పెద్దగా ఏమీ చేయలేరు. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవితంలోని అన్ని అంశాలలో మితంగా ఉండాలని” టిన్నిస్‌వుడ్ సలహా ఇచ్చాడు. “మీరు ఎక్కువగా తాగినా, ఎక్కువగా తిన్నా, లేదా ఎక్కువగా నడిచినా.. చివరికి మీరు బాధపడతారు” అని ఆయన పేర్కొన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో టిన్నిస్‌వుడ్ రాయల్ ఆర్మీ పే కార్ప్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ గా పనిచేశారు. తరువాత ఆయన చమురు కంపెనీలు షెల్, బిపిలో అకౌంటింగ్‌లో వృత్తిని పనిచేశారు. లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ మద్దతుదారుడిగా ఉన్న టిన్నిస్‌వుడ్ ప్రతి శుక్రవారం చేపలు, చిప్స్ తినే అలవాటును తన జీవితాంతం కొనసాగించాడు. ప్రస్తుతం 116 వయస్సుతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా జపాన్‌కు చెందిన టోమికో ఇటూకా ఉన్నారు.