ఘోర ప్రమాదం.. 39 మంది సజీవ దహనం

Feb 9,2025 10:53 #39 people, #death, #road accident

దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించారు. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో బస్సులోని 38 మంది ప్రయాణికులతో సహా, ఇద్దరు డ్రైవర్లు మృతిచెందినట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్‌ కూడా మరణించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 38 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. మృతుల వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ఉన్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నట్లు అధికారులు చెప్పారు.

➡️