వాషింగ్టన్ : ప్రముఖ సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ అమెరికాలో తన సేవలను నిలిపివేసింది. ఈ యాప్‌ను నిషేధించే ఫెడరల్ చట్టం అమల్లోకి రావడానికి ముందే ఈ యాప్‌ను ప్రముఖ యాప్ స్టోర్‌ల నుండి తొలగిస్తున్నట్లు శనివారం మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ప్రకటించింది. ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్, యాపిల్, గూగుల్ యాప్ స్టోర్‌లలో తొలగించింది. ”అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించే చట్టం అమల్లోకి రానున్నందున మీరు ఈ టిక్‌టాక్‌ను ఉపయోగించలేరు” అని వినియోగదారులకు శనివారం సాయంత్రం సందేశాన్ని పంపింది.
