అమెరికా-బ్రిటన్ వాణిజ్య ఒప్పందంపై నేడు చర్చ

May 8,2025 10:07 #America, #Britain

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించనున్నారని అమెరికా మీడియా పేర్కొంది. గొప్పదైన, అత్యంత గౌరవప్రదమైన దేశంతో అమెరికా “పెద్ద వాణిజ్య ఒప్పందం” కుదుర్చుకోబోతున్నదని డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు.  వైట్ హౌస్‌లోని ఓవల్ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు సమావేశంలో ఈ ఒప్పందాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అయితే ఆ దేశం ఏమిటన్నది అమెరికా మీడియా నేడు తెలిపింది. గత నెలలో అమెరికా వాణిజ్య భాగస్వాములపై ​ ట్రంప్ భారీ సుంకాలను విధించారు. తాత్కాలికంగా నిలిపివేసిన వాటిపై  వాణిజ్య ఒప్పందాల చర్చలకు అనుమతించనున్నారు. బ్రిటన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు అయిందా లేదా రెండు దేశాలు తదుపరి చర్చలకు లోబడి ఉండే ఒప్పందం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటిస్తాయా అనేది స్పష్టంగా లేదని టైమ్స్ పేర్కొంది.

➡️