లండన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై దాడిని యూరోపియన్ నేతలు ఖండించారు.
ఈ దాడిని చూసి తాను భయపడినట్లు బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఏ రూపంలోనైనా రాజకీయ హింసకు మన సమాజంలో స్థానం లేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని అన్నారు.
ఈ దాడి ప్రజాస్వామ్యంలో ఓ విషాదం అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ పేర్కొన్నారు. అమెరికా ప్రజల ఆందోళనను, ఆగ్రహాన్ని ఫ్రాన్స్ పంచుకుంటుందని అన్నారు.
ఈ దాడి హేయమైనదని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానంలేదు అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు.
ఈ సమయంలో తన ఆలోచనలు, ప్రార్థనలు ట్రంప్‌తో ఉన్నాయని హంగేరియన్ ప్రధాని విక్టర్ ఓర్బాన్ తెలిపారు.
పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తుండగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుండి ఆయన తృటిలో తప్పించుకున్నారు.