వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం రోజే అక్రమ వలసల్ని నిలువరిస్తామని, అమెరికా చరిత్రలోనే అతి పెద్దదైన ‘బహిష్కరణ’ ప్రక్రియను ప్రారంభిస్తామని గట్టిగా చెప్పారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు ఆచరణరూపం దాల్చాయి. అమెరికాలో ఉన్న భారతీయ అక్రమ వలసదారుల్ని ట్రంప్ ప్రభుత్వం సి-17 మిలటరీ విమానంలో పంపిస్తోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖా కార్యదర్శి మార్కో రూబియా సోమవారం తెలిపారు. అయితే వలసదారులతో విమానం బయలుదేరింది కానీ.. 24 గంటలైనా.. విమానం తిరిగి రాలేదు అని అమెరికా న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌కి ఓ అధికారి తెలిపారు. అయితే అమెరికాలోని భారతీయుల్ని బహిష్కరించడంపై మార్కో రూబియో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత విదేశాంగ శాఖామంత్రి ఎస్ జైశంకర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో చర్చలు జరపనున్నారని ఆయన అన్నారు.
కాగా, ఈ అక్రమ వలసదారుల బహిష్కరణ ప్రక్రియకు అమెరికా పరిపాలనా యంత్రాగం మిలటరీ సహాయాన్ని కోరింది. దీంతో వలసదారులను సైనిక విమానాల వారి స్వదేశాలకు పంపించే ప్రయత్నం జరుగుతోంది.
