జర్మనీ కంపెనీలో కాల్పులు – ఇద్దరు మృతి

Jan 8,2025 10:08 #firing, #Germany

జర్మనీ: నైరుతి జర్మనీలోని ఒక కంపెనీ ప్రాంగణంలో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాంతక గాయాలతో బాధపడుతున్నారని పోలీసులు తెలిపారు. స్టుట్‌గార్ట్‌కు ఉత్తరాన ఉన్న బాడ్ ఫ్రెడ్రిచ్‌షాల్ పట్టణంలో సాయంత్రం 5.45 గంటలకు ముసుగు ధరించిన వ్యక్తి ప్రవేశించిన తర్వాత కాల్పులు జరిగినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హెలికాప్టర్‌తో సహా పెద్దఎత్తున మోహరింపు జరుగుతోందని, అయితే ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని వారు విశ్వసిస్తున్నారు. బాధితుల గుర్తింపు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.

➡️