Russia : గ్యాస్‌పైప్‌లైన్‌పై దాడికి ఉక్రెయిన్‌ యత్నం

మాస్కో : దక్షిణ రష్యాలోని టర్క్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ మౌలిక సదుపాయంపై ఉక్రెయిన్‌ దాడికి యత్నించినట్లు రష్యా ప్రకటించింది. పైప్‌లైన్‌లో కొంతభాగాన్ని ధ్వసం చేసేందుకు యత్నించిన తొమ్మిది ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. ఈ పైప్‌లైన్‌ నుండి టర్కీ, యూరప్‌కు రష్యా గ్యాస్‌ను సరఫరా చేస్తుంది.
దక్షిణ రష్యాలోని క్రాస్నోడార్‌ ప్రాంతంలోని కంప్రెషర్‌ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుందని రస్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పైప్‌లైన్‌ యథావిథిగా పనిచేస్తోందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఒక డ్రోన్‌ శకలాలు పడిపోవడంతో భవనం, కంప్రెషర్‌ వద్ద ఉన్న గ్యాస్‌ మీటరింగ్‌ స్టేషన్‌ సామగ్రికి స్వల్ప నష్టం వాటిల్లిందని, అయితే అత్యవసర బృందాలు వెంటనే మరమ్మత్తులు చేశాయని రష్యా ఓ ప్రకటనలో పేర్కొంది.
గ్యాస్‌ పైప్‌లైన్‌ అనపా నగరం వెలుపల ఉన్న రస్కయా కంప్రెషర్‌ స్టేషన్‌ నుండి గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రారంభమై, టర్కీలోని కికోరు వరకు, అక్కడి నుండి యూరప్‌కు వెళుతుంది.

➡️