వాషింగ్టన్ : మంగళవారం రష్యా అధ్యక్షులు పుతిన్‌తో ఫోన్ సంభాషించిన ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ”ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడాను. దాదాపు గంటపాటు మా సంభాషణ కొనసాగింది. నిన్న పుతిన్‌తో జరిపిన చర్చలపైనే ఎక్కువ సేపు మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్, రష్యా శాంతి ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల అభ్యర్థనలు, అవసరాలపై ఇవి కొనసాగాయి. సరైన దారిలోనే ముందుకెళ్తున్నాం. చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్‌లను ఆదేశిస్తా. త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తాం” అని అధ్యక్షుడు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
