జపాన్‌లో అమెరికా క్షిపణి విస్తరణతో రష్యాకు ముప్పు

 రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ 
మాస్కో  : జపాన్‌లో అమెరికా క్షిపణులను మోహరిస్తే రష్యాకు ముప్పు వాటిల్లుతుందని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. అదే జరిగితే మాస్కో ప్రతీకారం తీర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తామని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. తైవాన్ చుట్టూ ఉన్న పరిస్థితులను అమెరికా మరింత తీవ్రతరం చేసి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసిందని జఖరోవా అన్నారు. ఫిలిప్పీన్స్‌లో అమెరికా క్షిపణులను మోహరించిందని, ఇది ప్రమాదాలను పెంచుతుందని ఆమె పేర్కొన్నారు.

➡️