భారత్‌కు చెందిన 19 ప్రైవేటు సంస్థలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్ : భారత్‌కు చెందిన 19 ప్రైవేటు సంస్థలపై, ఇద్దరు భారతీయులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి సహాయ సహకారాలు అందిస్తున్నారను కారణంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధిస్తూ జాబితా రూపొందించింది. ఆంక్షలు పొందిన భారత కంపెనీల్లో ఫుట్రెవో, అసెండ్ యావియేషన్, టిఎస్‌ఎండి గ్లోబల్, మాస్క్ ట్రాన్స్ వున్నాయి. రష్యన్ కంపెనీలకు ఆంక్షలు విధించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు ఈ కంపెనీలపై ఆరోపణలు చేశారు. డ్రోన్‌లు, విమానాల తయారీ సంస్థలు కూడా వీటిల్లో వున్నాయి. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి బుధవారం ఒక ప్రకటన చేసింది. చైనా, భారత్, కజకస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంకా తదితర దేశాలు వున్నాయి. ఉక్రెయిన్‌పై సాగించే యుద్ధానికి అవసరమైన ఆయుధ వ్యవస్థలను ఈ కంపెనీలు అందచేస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పనూును హత్య చేయడానికి కుట్ర పన్నడంలో భారత జాతీయుని పాత్ర వుందను ఆరోపణలపై అమెరికాలో ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది., పరిమిత వనరులతో వ్యూహాత్మ స్వయం ప్రతిపత్తిని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని దిశా నిర్దేశం చేస్తున్న భారతీయ కంపెనీలకు ఈ ఆంక్షలు సవాళ్ళను సృష్టిస్తాయని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్ అజయ్ సహారు వ్యాఖ్యానించారు. ఈసారి గణనీయమైన సంఖ్యలో భారత కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయం భారత పరిశ్రమలను, ప్రభుత్వాన్ని భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అప్రమత్తం చేస్తోందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి.
