ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలు వద్దు : భారత్‌కు అమెరికా ఆంక్షల హెచ్చరిక

అమెరికా : ” ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తాం ” అని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. సోమవారం ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టును పదేళ్లపాటు భారత్‌ నిర్వహించడానికి ఒప్పదం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రాంతీయ అనుసంధానంతో పాటు వాణిజ్య భాగస్వామ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది. అయితే ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిన ఆంక్షలు తప్పబోవని అమెరికా పరోక్షంగా భారత్‌ ను హెచ్చరించింది.

ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలకు వెళితే ఆంక్షలు కొనితెచ్చుకున్నట్లే : అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత పటేల్‌ మాట్లాడుతూ … చాబహార్‌ పోర్టుకు సంబంధించి.. భారత్‌-ఇరాన్‌ దేశాలు ఒప్పందం చేసుకున్నట్లు మాకు రిపోర్టుల ద్వారా తెలుసునన్నారు. భారత్‌ తన విదేశీ విధానంలో భాగంగా చాబహార్‌ పోర్టు విషయంలో ఇరాన్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకునే విషయంపై స్పందించాలి కానీ, తాను ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలనని అన్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధిస్తామని, ఇప్పటికే విధించిన ఆంక్షలు సైతం తీవ్రంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా సార్లు తాము ఆంక్షల విషయాన్ని ప్రస్తావించామన్నారు. ఎవరైనా, ఏ దేశమైనా ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిమైన ఆంక్షలు విధిస్తామని… అలా కాదని ఇతర దేశాలు ముందకు వెళ్లితే.. వారికి వారుగా ఆంక్షలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని ఇరాన్‌తో ఒప్పదం చేసుకున్న భారత్‌ను పరోక్షంగా వేదాంత పటేల్‌ హెచ్చరించారు.

➡️