న్యూయార్క్ : సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం రూ.2200 కోట్ల ముడుపులు చెల్లించారంటూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛ్‌ంజ్ కమిషన్ (సెక్) చేసిన అభియోగాలపై తమ వైఖరి వెల్లడించాలని కోరుతూ అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు అమెరికా నుండి సమన్లు అందాయి. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫార్మ్ నివాసానికి, సాగర్ నివాసానికి కూడా సమన్లు వెళ్లాయి. న్యూయార్క్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ద్వారా అందిన ఈ సమన్లుకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి వుంటుంది. ఒకవేళ సమాధానం ఇవ్వడంలో విఫలమైన పక్షంలో ఫిర్యాదులో పేర్కొన్న రిలీఫ్ కోసం మీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబడుతుందని ఆ నోటీసులు పేర్కొన్నాయి. తప్పనిసరిగా కోర్టుకు మీ సమాధానం అందాలని సమన్లు స్పష్టం చేశాయి. అమెరికా న్యాయ విభాగం కోర్టులో దాఖలు చేసిన నేర అభియోగ పత్రం కాకుండా సెక్ విడిగా గౌతమ్ అదానీ, సాగర్‌లపై అలాగే అజూర్ పవర్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కెబనీస్‌పై కూడా కేసు నమోదు చేసింది.
అదానీని వెంటనే అరెస్టు చేయొచ్చా ?
అమెరికా కోర్టులో అవినీతి అభియోగాలను ఎదుర్కొంటున్న భారత కుబేరుడు గౌతమ్ అదానీని ఈ కేసులో తక్షణమే అరెస్టు చేసే అవకాశం వుందా? అని ప్రశ్నిస్తే లేదనే చెప్పాలి. ముందుగా అదానీని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు భారత ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరం వుంది. రెండు దేశాల మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం అమల్లో వున్నందున ఆ నిబంధనల కింద కోరాల్సి వుంటుంది. ఆ ప్రక్రియను భారత్‌లోని న్యాయస్థానం చేపట్టాల్సి వుంటుంది. అమెరికాలో అదానీపై మోపిన నేరం భారత్‌లో కూడా నేరమా? కాదా? అనే అంశంతో సహా పలు అంశాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది.
అదానీ భారత్‌లోనే వున్నారని భావిస్తున్నప్పటికీ ఎక్కడ వున్నారనే ఆచూకీ కచ్చితంగా తెలియరాలేదు. ఈ పరిణామాలపై వ్యాఖ్యానించడానికి ఆయన అందుబాటులో కూడా లేరు. అదానీ ఈ అభియోగాలను సవాలు చేయగలరా అని ప్రశ్నిస్తే అవుననే చెప్పాలి. అమెరికా కోర్టులో ఆయన హాజరయ్యేవరకు ఆయన తరపు న్యాయవాదులు మాత్రమే వీటిని సవాలు చేయగలుగుతారు. ఉదాహరణకు అదానీపై అభియోగం మోపేందుకు అమెరికా ప్రాసిక్యూటర్లకు అధికారం లేదని చెప్పడం ద్వారా జరిగే అభిశంసన ప్రక్రియను ప్రాసిక్యూటర్లు సవాలు చేయడానికి అవకాశం వుంటుంది.
అదానీని అమెరికాకు