వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనున్నారని అమెరికా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. జెడి వాన్స్‌తోపాటు ఆయన భార్య ఉషా వాన్స్ (సెకండ్ లేడి)తో కలిసి భారత్ పర్యటనకు వెళ్ళనున్నారని అమెరికన్ వెబ్ మీడియా పొలిటికో తాజాగా నివేదించింది. ఉషా వాన్స్ భారతి సంతతి మహిళ. ఆమె తల్లిదండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మీ చిలుకూరి 1970లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. అయితే ఆమె భర్త జె.డి వాన్స్ ఉపాధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత ఆమె మొట్టమొదటిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు.
కాగా, అమెరికా ఉపాధ్యక్షుడుగా వాన్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నెలలో ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఆయన పర్యటించారు. వాన్స్ ఈ నెలలో రెండో విదేశీ పర్యటనలో భాగంగా భారత్ వెళ్లనున్నారని మీడియా పేర్కొంది.
