- ట్రంప్ సుంకాల బెదిరింపుపై మెక్సికో అధ్యక్షురాలు
మెక్సికో సిటీ : తమ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధిస్తే దానికి దీటుగా జవాబిస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షబ్నమ్ స్పష్టం చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తొలి రోజే మెక్సికో, కెనాడా, భారత్ ల నుండి వచ్చే ఉత్పత్తులపై భారీగా సుంకం విధించే ఉత్తర్వుపై సంతకం చేస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై మెక్సికో నేత పై విధంగా స్పందించారు. ఇలాంటి పెనాల్టీలు వల్ల అమెరికాకు వెళ్ళే శరణార్ధులు లేదా మాదకద్రవ్యాల రవాణా ఆగదని, పైగా ఇరు దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి కారణమవుతాయని తెలిపారు. దానికి బదులుగా ఈ సవాళ్ళను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని ఆమె పిలుపునిిచ్చారు. విధించిన ప్రతి పన్నుకు ప్రతిగా తాము కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించేవరకు ఇది కొనసాగుతుందన్నారు. ఈ మేరకు ఆమె ట్రంప్‌నకు మంగళవారం ఒక లేఖ రాశారు. చట్టవిరుద్ధమైన ఇమ్మిగ్రేషన్, ఫెంటానిల్ మాదకద్రవ్యాల సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ సోమవారం మాట్లాడుతూ కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.
అమెరికా నుండి భారీగా ఆయుధాలు అక్రమ రవాణా అవుతున్నాయని వాటివల్ల మెక్సికో తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని షబ్నమ్ చెప్పారు. అయినా ఇలా టారిఫ్‌లు విధించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటని ఆమె ప్రశ్నించారు. అధిక టారిఫ్‌ల వల్ల మెక్సికోలో ప్లాంట్‌లు వున్న అమెరికా కార్ల తయారీ సంస్థలు జనరల్‌మోటార్స్, ఫోర్ట్ వంటి కంపెనీలు దెబ్బతింటాయన్నారు.