న్యూయార్క్ : అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత గౌతమ్ అదానీపై అవినీతి కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందని ప్రముఖ ఇండో అమెరికన్ అటార్నీ రవి బాత్రా వెల్లడించారు. ఈ కేసులో అదానీపై నమోదు చేసిన అభియోగాలు లోపభూయిష్టం అని దేశాధ్యక్షుడు భావిస్తే కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అమెరికా ఫెడరల్ జిల్లాల్లో దేశ అధ్యక్షుడే ఒకొక్క స్టేట్ అటార్నీని నియమిస్తారు.