తొలి దశకు నేడు నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశకు సంబంధించిన నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది. తొలి విడతలో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. రాష్ట్రాలవారీగా ఎన్నికలు జరిగే లోక్‌సభ స్థానాలు : తమిళనాడు (39), రాజస్థాన్‌ (12), ఉత్తర్‌ప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6), అస్సాం (5), మహారాష్ట్ర (5), ఉత్తరాఖండ్‌ (5), బిహార్‌ (4), పశ్చిమ బెంగాల్‌ (3), మణిపుర్‌ (2), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), మేఘాలయ (2), ఛత్తీస్‌గఢ్‌ (1), మిజోరం (1), నాగాలాండ్‌ (1), సిక్కిం (1), త్రిపుర (1), అండమాన్‌ నికోబార్‌ (1), జమ్ముకాశ్మీర్‌ (1), లక్షద్వీప్‌ (1), పుదుచ్చేరి (1).

➡️