భావ ప్రకటనకు సంకెళ్లు

  • జర్నలిస్ట్‌ నిఖిల్‌ వాగ్లేపై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌
  • అద్వానీకి భారతరత్నపై విమర్శల ఫలితం

న్యూఢిల్లీ : భారత్‌లో భావప్రకటనా స్వేచ్ఛకు చోటు ఉండటం లేదు. బీజేపీ పాలనలో ఇది చాలా తీవ్రమైంది. ఐక్యరాజ్యసమితితో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, సంస్థలూ ఇదే విషయాన్ని చెప్తున్నాయి. బీజేపీ సీనియర్‌ నాయకులు ఎల్‌.కె అద్వానీకి కేంద్రంలోని మోడీ సర్కారు భారతరత్న అవార్డును ప్రటకించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని పలువురు తప్పుబట్టారు. ‘మహారాష్ట్రలోని ఒక జరల్నిస్టు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్నను ప్రటకించటంపై నిఖిల్‌ వాగ్లే విమర్శించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా వ్యక్తపరిచారు. తన భావాన్ని ప్రకటించటమే ఇప్పుడు ఆ జర్నలిస్టుకు శాపమైంది. దీని ఫలితంగా ఇప్పుడు ఆయనపై కేసు నమోదైంది. బీజేపీ నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకే మహారాష్ట్ర పోలీసులు సదరు జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయటం గమనార్హం. బీజేపీకి చెందిన సునీల్‌ దేవధర్‌.. విష్రాంబాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే వాగ్లేపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది.

➡️