– మరో నాలుగు స్థానాలకు సిపిఎం అభ్యర్థుల ప్రకటన
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేయనున్న మరో నాలుగు లోక్‌సభ స్థానాలకు సిపిఎం తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మహ్మద్ సలీం, బర్ద్వాన్ – దుర్గాపుర్ నుంచి సుకృతి ఘోషాల్, రాణాఘాట్ నుంచి అలకేశ్ దాస్, బోల్‌పూర్ నుంచి శ్యామిలి ప్రధాన్ పోటీ చేయనున్నట్లు సిపిఎం పేర్కొంది. వీరందరినీ లెఫ్ట్‌ఫ్రంట్ నామినేట్ చేసినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు బెంగాల్‌లో 17 స్థానాలకు, దేశవ్యాప్తంగా 43 స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించినట్లైంది. బెంగాల్‌లో సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించి, ప్రజా కేంద్రీకృత అజెండాకు మద్దతు తెలియజేయాలని విన్నవించింది. ప్రజా వ్యతిరేక విధానాలతో, నిరంకుశ చర్యలకు పాల్పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ – బిజెపి దుష్ట ద్వయాన్ని ఓడించాలని పిలుపునిచ్చింది.
