మెరుగైన భారతదేశ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేయాలి

Mar 25,2024 00:15 #sitha ram yechuri

– సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– భగత్‌ సింగ్‌కు సిపిఎం ఘన నివాళి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
మెరుగైన భారతదేశ నిర్మాణ సంకల్పాన్ని బలోపేతం చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు, అమరవీరులు షాహిద్‌ భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వర్థంతి సందర్భంగా సిపిఎం ఘనంగా నివాళి అర్పించింది. ఈ మేరకు సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకె గోపాలన్‌ భవన్‌)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య లక్షణాన్ని కాపాడుకునేందుకు, దేశ ప్రజలందరూ సమానమైన, దోపిడీ రహిత సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి భగత్‌ సింగ్‌ ఊహించిన విధంగా మెరుగైన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, తపన్‌ సేన్‌, నిలోత్పల్‌ బసు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️