చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపిని ఓడించేవరకూ తమ పార్టీ నిద్రపోదని తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ తేల్చిచెప్పారు. డిఎంకెకు, ఇండియా కూటమి పార్టీలకు నిద్రలేదంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘అవును, మోడీని, బిజెపిని ఇంటికి పంపేవరకూ మనం నిద్రపోలేము. 2014లో రూ.450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.1200. ఎన్నికలతో మోడీ డ్రామా మొదలైంది. రూ.100 తగ్గించారు. ఎన్నికల తర్వాత రూ.500 పెంచుతారని’ ఉదయనిధి విమర్శించారు. తమిళనాడులో తుపాను బీభత్సం సఅష్టించిన కాలంలో మోడీ ఇటువైపు చూడలేదని విమర్శించారు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేయాలని ముఖ్యమంత్రి కోరినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఉదయనిధి తెలిపారు.
