పంజాబ్‌లో 105 కిలోల డ్రగ్స్‌ సీజ్‌

చండీగఢ్‌: పంజాబ్‌లో 105 కేజీల డ్రగ్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. సముద్ర మార్గంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు ఇంటెలిజన్స్‌ వర్గాలకు సమాచారం అందడంతో .. పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించినట్లు డీజీపీ గౌరవ్‌ పేర్కొన్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని పెద్ద రబ్బరు ట్యూబ్‌లు, తుపాకులు, 105 కేజీల హెరాయిన్‌, 31.93 కేజీల కెఫిన్‌ అన్‌హైడ్రస్‌, 17 కేజీల డీఎంఆర్‌ను స్వాధీనం చేసుకున్నాట్లు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన డ్రగ్‌ స్మగ్లర్‌తో సంబంధం ఉన్న నవజ్యోత్‌ సింగ్‌, లవ్‌ప్రీత్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

➡️