12.25 శాతం మంది బాలికలు డ్రాపౌట్

ఢిల్లీ : సెకండరీ స్థాయిలో 12.25 శాతం బాలికలు బడి మానేస్తున్నారని విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాజ్యసభలో పి సంతోష్‌కుమార్‌కు సమాధానమిచ్చారు. దీనికి సామాజిక-ఆర్థిక అంశాలు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. 2021-22 నివేదికల ఆధారంగా దిగువ ప్రాథమిక స్థాయిలో డ్రాపౌట్ రేటు 1.35 శాతం, ఉన్నత ప్రాథమిక స్థాయిలో 3.31 శాతంగా ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన పి సంతోష్ కుమార్ ‘బేటీ బచావో బేటీ పఢావో’ అనేది కేవలం నినాదంగా మాత్రమే మారిందని అన్నారు.

➡️