19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం

Mar 31,2024 10:55 #1 June, #19, #Ban, #exit polls

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ను నిషేధిస్తూ భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోలింగ్‌ ముగియడానికి నిర్ణయించిన సమయంతో ముగిసే 48 గంటల వ్యవధిలో ఒపీనియన్‌ పోల్స్‌, మరేదైనా పోల్‌ సర్వేతో సహా ఎన్నికలను ప్రభావితం చేసే వాటిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7.00 గంటల నుంచి జూన్‌ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల మధ్య ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించడం, ప్రచురించడం లేదా ప్రచారం చేయడంపై నిషేధం విధించింది.

➡️