గాంధీనగర్ : గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు, వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకు 28 మరణించారు. లోతట్టు ప్రాంతాల నుండి 17,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 5,000 మందికి పైగా ప్రజలకు పునరావాసం కల్పించినట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ పేర్కొన్నారు. బుధవారం వరకు వడోదర నుండి 12,000 మందిని రక్షించినట్లు తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను చేపడుతున్నాయని అన్నారు.
తూర్పు రాజస్థాన్ నుండి గుజరాత్ మీదుగా కదులుతున్న అల్పపీడనంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్‌ఇఒసి) ప్రకారం.. గుజరాత్ ఇప్పటి వరకు దాని సగటు వార్షిక వర్షపాతంలో 105 శాతం పొందింది. అనేక జిల్లాల్లో ముఖ్యంగా ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్ మరియు రాజ్‌కోట్‌లలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిసినట్లు తెలిపింది.