సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం 9.18 గంటలకు మండిపట్టణం సమీపంలో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 3.4గా నమోదైందని, భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. మండి జిల్లా భూకంప జోన్ 5 కిందకు వస్తుంది. ఇది అధిక నష్టం కలిగించే జోన్.
