కోల్‌కతా: ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదిావారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఖయర్తాలా ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్దం విని స్థానికులు భయాందోళన చెందారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మామున్ మొల్లా, సకీరుల్ సర్కార్, ముస్తాకిన్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. మామున్ మొల్లా అనే వ్యక్తి తన ఇంట్లోనే దేశీయ బాంబులు తయారు చేస్తున్నాడని, వాటిని తయారు చేసే క్రకమంలోనే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.