Road accident : మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తూ.. ట్రాక్టర్‌ బోల్తాపడి 34 మందికి గాయాలు

కస్గంజ్‌ : ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 34 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన బుధవారం కస్గంజ్‌ జిల్లాలో జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అడిషనల్‌ సూరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎసిపి) రాజేష్‌ కుమార్‌ భర్తి మీడియాతో మాట్లాడుతూ.. ‘గంగా నదిలో స్నానం చేసి యాత్రికులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 34 మంది గాయాలపాలయ్యారు. కానీ వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా లేదు. ప్రస్తుతం వారిని చికిత్స కోసం గంజ్‌దుండ్వారా సిహెచ్‌సికి తరలించాం’ అని ఆయన అన్నారు. ఈ ఘటనపై సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ (ఎస్‌డిఎం), ఆ ఏరియా సర్కిల్‌ ఆఫీసర్‌ (సిఓ) సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

➡️