మంగళగిరి ఎయిమ్స్‌లో 38 మంది వైద్యుల రాజీనామా

602 పోస్టులు ఖాళీ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :వివిధ కారణాలతో మంగళగిరి ఎయిమ్స్‌లో గత మూడు సంవత్సరాల్లో 38 మంది డాక్టర్లు రాజీనామా చేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ ఈ విషయం తెలిపారు. అయితే, రాజీనామాలకు కారణాలను మాత్రం ఆమె పేర్కొనలేదు. ఈ సంస్థలో ఇప్పటికే 125 ఫ్యాకల్టీ, 477 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏర్పాటైన మంగళగిరి ఎయిమ్స్‌లో అనేక సమస్యలున్న విషయం తెలిసిందే. సిబ్బందికి నివాసాల కొరతతోపాటు ఆసుపత్రిలో కూడా అనేక ప్రాధమిక సమస్యలున్నాయి. గత మూడేళ్లలో మంగళగిరిసహా దేశంలోని ఉన్న 20 ఎయిమ్స్‌ల్లో 422 మంది డాక్టర్లు రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 ఎయిమ్స్‌ల్లో 2,114 ఫ్యాకల్టీ, 17,138 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

➡️