హెచ్‌ఏఎల్‌కు రక్షణ శాఖ రూ. 65 వేల కోట్ల టెండర్‌

ఢిల్లీ : హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)కు కేంద్ర రక్షణ శాఖ సుమారు రూ. 65,000 కోట్ల ఖరీదైన టెండర్‌ను ఇచ్చింది. ఈ టెండర్‌ మేడ్‌-ఇన్‌-ఇండియా 97 ఎల్‌సీఏ మార్క్‌ 1ఏ ఫైటర్‌ విమానాల కోసం ఇచ్చింది. ఇది స్వదేశీ మిలటరీ హార్డ్‌వేర్‌ కోసం భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్‌ కావడం గమనార్హం. టెండర్‌ జారీ చేసిన అనంతరం రక్షణ శాఖ తమ నిర్ణయాన్ని వెల్లడించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ టెండర్‌ను హెచ్‌ఏఎల్‌ చేపడితే భారత వైమానిక దళంలోని మిగ్‌ 21, మిగ్‌23, మిగ్‌27 విమానాల స్థానంలో కొత్త ఫైటర్‌ విమానాలు భర్తీ కానున్నాయి.

➡️