ఇప్పటి వరకు 66.95 శాతం పోలింగ్‌

  •  4 దశల్లో 381 లోక్‌సభ స్థానాలకు పూర్తి
  •  ఓటు హక్కును వినియోగించుకున్న 45.1 కోట్ల మంది

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు నాలుగు దశల పోలింగ్‌ జరిగింది. ఇంకా మూడు దశల పోలింగ్‌ మిగిలి ఉంది. ఇప్పటి వరకు 381 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే మిగిలిన దశల పోలింగ్‌లో పెద్దయెత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇసి పిలుపునిచ్చింది. మొదటి దశలో 102, రెండో దశలో 89, మూడో దశలో 94, నాలుగో దశలో 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. ఇంకా మూడు దశలు మిగిలి ఉండగా, 163 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ మిగిలి ఉంది. మే 20న ఐదో దశలో 49 స్థానాలకు, మే 25న ఆరో దశలో 57 స్థానాలకు, జూన్‌ 1న ఏడో దశలో 57 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

➡️