గుడిసెలోకి దూసుకెళ్లి బోల్తాపడిన ట్రక్కు – 8మంది మృతి

యుపి : యుపి లో మంగళవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిన్న అర్థరాత్రి గుడిసెలో నిద్రిస్తున్నవారిపైకి అకస్మాత్తుగా ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘోర ఘటనలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల మేరకు … హర్దోరు జిల్లాలో భల్లా కంజాద్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్‌ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రక్కు మెహందీఘాట్‌, కన్నౌజ్‌ నుంచి హర్దోరుకు వెళుతున్న క్రమంలో … అదుపుతప్పి రోడ్డు పక్కన నివసిస్తున్న గుడిసెలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కుటుంబ సభ్యులంతా ఇసుకలో కూరుకుపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️