గువహటి : అస్సాంలోని బొగ్గుగనిలో చిక్కుకున్న తొమ్మిది మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని ఆర్మీ వెలికితీసినట్లు బుధవారం అధికారులు తెలిపారు. గనిలోపల డైవర్లు ఒక మృతదేహాన్ని కనుగొన్నారని, అయితే గుర్తింపు ఇంకా నిర్థారించలేదని అన్నారు. అస్సాంలోని దిమా హసౌ జిల్లాలో అనుమతులు లేని ఒక బొగ్గు గనిలో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించగా, పది మంది గనిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఉమ్రాంగ్సోలోని 300 అడుగుల లోతులో ఉన్న ఈ బగ్గుగనిలోకి అకస్మాత్తుగా వరదనీరు చేరడంతో ప్రమాదం జరిగింది. చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నేవీ, సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.