Accident: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం

Oct 30,2024 07:13 #Rajasthan, #road accident

కల్వర్టును బస్సు ఢకొీని 12 మంది మృతి
జైపుర్‌ : రాజస్థాన్‌లోని సికర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సలాసర్‌ నుంచి వెళ్తున్న బస్సు సికర్‌ జిల్లాలోని లక్ష్మణ్‌గఢ్‌ వద్దకు రాగానే ఎదురుగా కల్వర్టును ఢకొీనింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే చేరుకొని గాయపడినవారిని చికిత్స నిమిత్తం లక్ష్మణ్‌గఢ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైనవారిలో 12 మంది మరణించారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మహేంద్ర ఖిచాడ్‌ తెలిపారు.

➡️