కేంద్రం కీలక నిర్ణయం : పంట వ్యర్థాలు దగ్ధం చేస్తే రైతులకు జరిమానా

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం వల్ల గాలి నాణ్యతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలోని రైతులు తమ పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్లే ఢిల్లీలో విపరీతంగా వాయుకాలుష్యం పెరుగుతోందని విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. పంట వ్యర్థాలను దగ్ధం చేసిన రైతులకు రెట్టింపు జరిమానా విధించేలా నిబంధనలు సవరిస్తూ తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. కేంద్ర నిబంధనల ప్రకారం.. రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రూ. 5 వేల జరిమా, రెండు నుంచి ఐదు ఎరాల మధ్య ఉన్నవారికి రూ. 10 వేలు, ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ. 30 వేలు జరిమానా విధించనున్నారు.ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

➡️